: సొంత తమ్ముడే చిరంజీవిని నమ్మడం లేదు... ప్రజలెలా నమ్మాలి?: వైకాపా
సొంత తమ్ముడు పవన్ కల్యాణే కేంద్ర మంత్రి చిరంజీవిని నమ్మడం లేదని, అలాంటప్పుడు ప్రజలెలా నమ్మాలి? అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాగిరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తన పార్టీని హోల్ సేల్ గా అమ్ముకున్న చిరంజీవి, చెన్నైలో తన వియ్యంకుడి ఇంట్లో దొరికిన 70 కోట్ల రూపాయల కేసు ఏమైందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి హామీలన్నీ నకిలీ నోట్ల లాంటివని ఆయన విమర్శించారు.