: కరెంటు బిల్లులు తగలబెట్టండి: శ్రేణులకు బాబు పిలుపు


విద్యుత్ సమస్యల పట్ల సర్కారు వైఖరికి వ్యతిరేకంగా కరెంటు బిల్లులను తగలబెట్టాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ముందు చూపు లోపించడం వల్లే రాష్ట్రంలో కారుచీకట్లు కమ్ముకున్నాయని బాబు ఆరోపించారు. ప్రస్తుతం బాబు తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యమాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్ళాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన పాదయాత్రలో పిల్లలు, పెద్దలు, మహిళలు, పేదలు, రైతులు అందరితో మాట్లాడానని, వారి సమస్యలేంటో అవగతం చేసుకున్నానని బాబు వివరించారు. ప్రజల కష్టాలు తొలగించడానికి తమ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News