: బాబా రాందేవ్ కు ఢిల్లీ ఈసీ నోటీసు
యోగా గురువు బాబా రాందేవ్ కు ఢిల్లీ ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఢిల్లీలో 'యోగా మహోత్సవ్' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారని, దానిపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలిపింది.