: నేడు విండీస్ తో బంగ్లాదేశ్ ఢీ


టీ20 వరల్డ్ కప్ టోర్నీలో నేటి సాయంత్రం ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్ తో తలపడనుంది. తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమిపాలైన విండీస్ ఈ పోరులో నెగ్గి రేసులో నిలవాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు, బంగ్లా జట్టు క్వాలిఫయింగ్ పోటీల్లో ప్రదర్శించిన జోరును ఇక్కడా చూపాలని తహతహలాడుతోంది. కాగా, స్పిన్ ఆడడంలో కాస్తంత బలహీనంగా కనిపించే కరీబియన్లు బంగ్లా స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. అయితే, ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పే విధ్వంసక శక్తి క్రిస్ గేల్ మరోమారు తన బ్యాట్ కు పనిచెబితే మాత్రం ఆతిథ్య జట్టుకు కడగండ్లు తప్పవు.

  • Loading...

More Telugu News