: సీటు కేటాయించలేదని... శుక్లా అభిమానుల ఆందోళన
సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలపై అభ్యర్థులు మండిపడుతున్నారు. పార్టీలను నమ్ముకున్న వ్యక్తులు... తమను పార్టీలు పక్కన పెడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఛత్తీస్ గఢ్ లో కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా కుమార్తె ప్రతిభాపాండేకు... మహాసముంద్ నియోజకవర్గం టికెట్ నిరాకరించడంపై ఆమె మద్దతుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లోని 11 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, మార్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపులో నక్సల్స్ దాడిలో మరణించిన కాంగ్రెస్ నేతల బంధువులకు ప్రాధాన్యత కల్పించారు. దివంగత నేత మహేంద్ర కర్మ కుమారుడు దీపక్ కర్మకు బస్తర్ సీటు కేటాయించడంతో పాండేకు సీటు ఖాయమని ఆమె మద్దతు దారులు ఆశించారు. వారి ఆశను కాంగ్రెస్ అధిష్ఠానం వమ్మ చేయడంతో వారు ఆందోళనకు దిగారు.