: కాంగ్రెస్ తో జతకడితే సీపీఐకి రాంరాం: సీపీఎం
కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకించే పార్టీలతోనే ముందుకు వెళతామని... లేని పక్షంలో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ తో కలిసేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ తో సీపీఐ జతకట్టాలనుకుంటే... ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ కు దూరంగానే ఉండాలని ఇప్పటికే సీపీఐకి స్పష్టం చేశామని వెల్లడించారు.