: జస్వంత్ సింగ్ ఆస్తులివి
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తిరుగుబాటు నేత జస్వంత్ సింగ్ తన ఆస్తులను ప్రకటించారు. బర్మర్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్న జస్వంత్... తన ఆస్తుల విలువ కోటీ 49 లక్షల 83 వేల 510 రూపాయలని పేర్కొన్నారు. అందులో మూడు అరబ్ గుర్రాలు, 51 థార్పర్కర్ ఆవులున్నాయని చెప్పారు. 51 ఆవులు జైసల్మేర్, బర్మర్ లో ఉన్నట్టు తెలిపారు. తన వద్ద ఉన్న మూడు ఆవుల్లో సౌదీ అరేబియా యువరాజు రెండు ఆవులను బహూకరించారని, తరువాత మరో ఆవు జన్మించిందని ఆయన వెల్లడించారు.