: లంక క్రికెటర్లూ.. ఐపీఎల్ లో ఆడొద్దు: రణతుంగ
శ్రీలంక తమిళుల సమస్యను బూచిగా చూపి తమ దేశ క్రికెటర్లను చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ల నుంచి తప్పించడాన్ని సింహళ క్రికెట్ జట్టు మాజీ సారథి అర్జున రణతుంగ తప్పుబట్టారు. చెన్నైలో మ్యాచ్ ల నిర్వహణ వీలుకాకపోతే మ్యాచ్ లను వేరే వేదికలకు మార్చాలిగానీ, ఆటగాళ్ళను తొలగించడం అనైతికమని దుయ్యబట్టారు. లంక యుద్ధ నేరాలను సాకుగా చూపుతూ, చెన్నైలో ఆటగాళ్ళకు నో ఎంట్రీ చూపుతున్నారని, ఇది రాజకీయ వ్యూహమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకనైనా ఆటగాళ్ళు దేశానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ, ఐపీఎల్ నుంచి వైదొలగాలని రణతుంగ సూచించారు.