: గూగుల్ గ్లాస్ కు రేబాన్ సొబగులు


సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ రూపొందించిన ఇంటర్నెట్ ఐవేర్ 'గూగుల్ గ్లాస్' ఇక రేబాన్ ఫ్రేమ్స్ తో లభించనుంది. ప్రఖ్యాతి గాంచిన రేబాన్, ఓక్లే బ్రాండ్ కళ్ళజోళ్ళకు ఫ్రేములు అందించే లక్జోటికా సంస్థతో గూగుల్ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై రేబాన్ ఫ్రేమ్స్ తో గూగుల్ గ్లాస్ కనువిందు చేయనుంది. ఈ ఫ్రేమ్ కుడివైపున థంబ్ నెయిల్ సైజులో చిన్న స్క్రీన్ ఉంటుంది. దాంట్లో ఇంటర్నెట్ ను వీక్షించవచ్చు. ఓ రకంగా, నడిచే అంతర్జాలంలా దీన్ని భావించవచ్చు. అంతేకాదు, దీనికి ఓ బుల్లి కెమెరాను అటాచ్ చేశారు. తద్వారా చేతులతో పనిలేకుండా ఫొటోలు క్లిక్ మనిపించే అవకాశముంటుంది. వీడియో సౌకర్యం అదనం.

  • Loading...

More Telugu News