: సుష్మ నోట వినిపించని మోడీ మాట


బీజేపీ అగ్రనేతల్లో మోడీ పట్ల వ్యతిరేక వైఖరి మరోసారి వ్యక్తమైంది. తాజాగా మధ్యప్రదేశ్ లో పలు సభల్లో పాల్గొన్న సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కనీసం మోడీ పేరును మాటమాత్రమైనా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశం అయింది. విదిశలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ ఆమె ఇదే తరహాలో మాట్లాడారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై ప్రశంసల వర్షం కురిపించిన సుష్మ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని విస్మరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ హ్యాట్రిక్ సాధించారు. మధ్యప్రదేశ్ లో ఎక్కడ చూసినా ఆయన పాప్యులరే అని పేర్కొన్నారు.

సుష్మ ఈ ఎన్నికల్లో విదిశ నుంచే లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బీజేపీ కార్యకర్త మాట్లాడుతూ, మోడీ పేరు ప్రస్తావించకుండా ఎవరి పేరు మీద ఆమె ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఆమె పద్ధతి సరికాదని ఆ కార్యకర్త పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News