: కేజ్రీవాల్ పై సిరా చల్లిన నిరసనకారుడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా వారణాసిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉన్న కేజ్రీపై నిరసనకారుడు సిరా చల్లాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు కేజ్రీవాల్ వాహనంపై కొంతమంది కోడిగుడ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే.