: మన బాధలేంటో ప్రజలకు చెప్పండయ్యా.. : మంత్రులతో సీఎం


రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రమవడానికి గల కారణాలను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాన్ని కోరారు. సీఎం ఈ సాయంత్రం మంత్రి వర్గ సహచరులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా విద్యుత్ సంక్షోభంపైనే చర్చ జరిగినట్టు సమాచారం.

విద్యుత్ ఛార్జీల వ్యవహారంలో ప్రభుత్వంపై పడుతున్నభారం వివరాలను ప్రజలకు విడమర్చాలని ఆయన మంత్రులకు సూచించారు. ఇక, త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు మంత్రులు క్షేత్రస్థాయిలో తయారుగా ఉండాలని సీఎం అన్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స, పొన్నాల, ఆనం, కొండ్రు మురళి, డొక్కా మాణిక్య వరప్రసాద్, డీకే అరుణ తదితరులు హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News