: రూ.లక్ష విరాళమిచ్చిన భక్తులకు శ్రీవారి గ్రీటింగ్ కార్డులు
లక్ష రూపాయలకు పైగా విరాళమిచ్చిన భక్తులకు ఉగాది శుభాకాంక్షలతో కూడిన శ్రీవారి గ్రీటింగ్ కార్డులు పంపించాలని నిర్ణయించుకున్నట్టు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. గడచిన ఏడాది కాలంలో తిరుమల శ్రీవారి ట్రస్టులకు మొత్తం రూ. 51 కోట్లు విరాళంగా వచ్చినట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఈ సంవత్సరంలో లక్ష రూపాయలకు పైగా విరాళమిచ్చిన 30 వేల మందికి ఉగాది శుభాక్షాంక్షల గ్రీటింగ్ కార్డులను పంపిస్తున్నామని జేఈవో ప్రకటించారు.