: మోహన్ బాబు 'రౌడీ' సినిమాను నిలిపివేయాలంటూ ఆందోళన


మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న 'రౌడీ' సినిమాపై ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలను ఆపివేయాలంటూ వారు ఈరోజు విశాఖలో ఆందోళనకు దిగారు. ఈ సినిమాలో రాజకీయపరంగా రౌడీయిజాన్ని చెలాయించే అంశాలు ఎక్కువగా ఉన్నాయని... ఈ చిత్రం విడుదలైతే సమాజంలో రౌడీయిజం పెరిగిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News