: బాలీవుడ్ దిగ్గజ నటి అస్తమయం


బాలీవుడ్ తొలి తరం అందాల నటి నందా ముంబైలో ఈ ఉదయం కన్నుమూశారు. గుండె పోటు రావడంతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. హమ్ దోనో, ఇతేఫక్ చిత్రాల ద్వారా ఆమె ప్రాచుర్యంలోకి వచ్చారు. 1950ల్లోనే తండ్రి మరణంతో బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. శశికపూర్ తో కలసి ఎనిమిది సినిమాల్లో నటించారు. వహీదా రెహ్మాన్ తో కూడా కలసి పనిచేశారు. వీరిద్దరు నటించిన కాలాబజార్ (1960) సినిమా అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. నిర్మాత మన్మోహన్ దేశాయ్ తో పెళ్లి నిశ్చయం కాగా... తర్వాత ఆయన ప్రమాదవశాత్తూ ఇంటి మిద్దెపై నుంచి కిందపడి మరణించారు. దాంతో ఇక పెళ్లి చేసుకోకూడదని ఆమె నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News