: మలేసియా ప్రభుత్వానిదే భాధ్యత: విమాన ప్రమాద బాధితుల బంధువులు


మలేసియా విమాన ప్రమాదానికి పూర్తి బాధ్యత మలేసియా ప్రభుత్వం వహించాలని... ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మలేసియాలో వారు మాట్లాడుతూ, మలేసియా ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని, మలేసియా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని మండిపడ్డారు. సరైన సమాచారం, సమగ్రమైన దర్యాప్తు లేకపోవడం వల్లే తాము దుఃఖసాగరంలో మునిగిపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యుల లోటు ఎవరూ పూడ్చలేనిదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News