: పార్టీ పేరుతో బాలికపై రెండు సార్లు సామూహిక అత్యాచారం


మరో బాలిక ముంబైలో కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైంది. ఓ స్వచ్చంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న పేద బాలికను నలుగురు యువకులు పార్టీ ఆశచూపి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురు నిందితులు ఉజర్ ఖాన్(24), అజయ్ జైస్వాల్(21), కంతి అనాదియా(20), అమీర్ చౌదరి(19)లను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల సదరు బాలిక హోలీ పండుగకు ఇంటికెళ్లింది. నలుగురు నిందితులూ ఆమెకు తెలిసినవారే. పార్టీకి వెళదామని చెప్పి అంధేరీ తూర్పు ప్రాంతంలోని బీఎంసీ గ్రౌండ్ కు తీసుకెళ్లారు.

వారు ఆల్కహాల్ తాగడంతోపాటు ఆమెకు కూడా డ్రింక్ లో కలిపి తాగించారు. అనంతరం నలుగురూ అత్యాచారం చేసి తీసుకెళ్లి ఇంటిదగ్గర దింపేశారు. మరుసటి రోజు కూడా పార్టీ ఉందని తీసుకెళ్లి అదే పనిచేశారు. మత్తులో ఉండడంతో ఆమెకు జరిగింది గుర్తులేదు. కానీ, ఆ తర్వాత అనారోగ్యంగా ఉండడంతో వారిని ప్రశ్నించింది. జరిగింది చెప్పారు. భయంతో ఇంట్లో చెప్పకుండా సంరక్షణ కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఆమె ప్రవర్తన తేడాగా ఉండడంతో సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అత్యాచారం జరిగినట్లు తేల్చడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News