: అప్పుల నుంచి ఆస్తులు వైపు నడిపిన ఘనత బాబుది: పయ్యావుల


రాష్ట్రాన్ని అప్పుల నుంచి ఆస్తుల వైపు నడిపిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిదని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, కొత్త రాష్ట్రంలో సవాళ్లు ఉన్నాయనే విషయం తమకు తెలుసని, ఆ సవాళ్లు ఎదుర్కోనే సత్తా చంద్రబాబు నాయుడికే ఉందని తెలిపారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని దిగ్విజయంగా నడిపిన ఘనత చంద్రబాబు నాయుడిదని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉందని, గెలిచినా కోర్టుల చుట్టూ తిరుగుతాడని ఆరోపించారు. అందుకే టీడీపీని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత అందరిదీ అని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News