: భర్త మోడీతో, భార్య ములాయంతో...అమితాబ్ పై అమర్ సెటైర్లు
రాజకీయాల్లో అన్నీ వింతలు, విశేషాలే. భార్య, భర్తలు ప్రత్యర్థులుగా పోటీ చేయడం, సోదరులు ఎదురెదురుగా బరిలో దిగడం వంటివన్నీ జరుగుతుంటాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబంలో ఇలాంటి విశేషమే చోటు చేసుకుంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అమితాబ్ బచ్చన్ అత్యంత సన్నిహితుడు. గుజరాత్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ కూడా అమితాబ్ బచ్చనే.
అమితాబ్ భార్య జయాబచ్చన్ మాత్రం మోడీ పొడగిట్టని ములాయం పంచన చేరింది. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా, ఎంపీగా చట్టసభలో ఉన్నారు. దీనిపై ఒకప్పటి అమితాబ్ సన్నిహితుడు అమర్ సింగ్ సెటైర్లు వేశారు. భర్త మోడీతో, భార్య ములాయంతో 'వాహ్ క్యా ఫ్యామిలీ హై' అంటూ ఎద్దేవా చేశారు.