: పెళ్లి ఖర్చుల కోసం రైలు దోపిడీ


భాజా భజంత్రీల హోరు. బంధుమిత్రులు, అతిథుల సందడి. బీహార్లోని సీతామర్హిలో కల్యాణం కమనీయంగా జరుగుతోంది. పోలీసులు హడావిడిగా వచ్చి వరుడిని అరెస్ట్ చేశారు. అక్కడున్న వారికి విషయం అర్థం కాక పోలీసులను ప్రశ్నించారు. సదరు పెళ్ళికొడుకు పెద్ద దొంగ అని పోలీసులు చెప్పారు. ఆ వరుడు తన పెళ్లి ఖర్చుల కోసం జనవరి 28న సికింద్రాబాద్-రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ లో రూ.14లక్షల విలువైన వజ్రాలను దొంగిలించాడు. అదే రైలులో ప్రయాణించిన హైదరాబాద్ నివాసి హేమంత్ కుమార్ సింగ్ వజ్రాలు, డబ్బుతో ఉన్న తన బ్యాగు దొంగతనానికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో రెండు మొబైల్ ఫోన్లు ఉండడంతో పోలీసులు నిందితుడైన వరుడిని పట్టుకోగలిగారు. వజ్రాలు అమ్మగా వచ్చిన డబ్బుతో చోరవరుడు రూ.2లక్షలు పెట్టి సోఫాకమ్ బెడ్ కొన్నాడు. రిఫ్రిజిరేటర్, కప్ బోర్డు, టీవీసెట్, టేబుల్, ఆభరణాలను కూడా కొన్నట్లు తేలింది.

  • Loading...

More Telugu News