: మోడీ బీజేపీ పాలిట భస్మాసురుడు: కాంగ్రెస్
బీజేపీలో ఏర్పడిన తాజా పరిణామాలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కాషాయదళంలో విభేదాలకు ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీయే కారణమని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి నేడు ట్విట్టర్లో ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, మోడీని బీజేపీ పాలిట భస్మాసురుడిగా అభివర్ణించారు. గత కొన్ని రోజులుగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలు మోడీపై ఆ పార్టీ సీనియర్ల వ్యతిరేకతను చాటుతున్నాయని పేర్కొన్నారు.
'అద్వానీ, జశ్వంత్ సింగ్, హరీన్ పాఠక్, రాజేంద్ర సింగ్ రాణా, లాల్ ముని చౌబే వంటి సీనియర్ నాయకులే మోడీపై నమ్మకం ఉంచకపోతే, ఇక జాతి ఎలా నమ్మకం పెట్టుకోవాలి ఆయనపై?' అని సింఘ్వి ట్వీట్ చేశారు.