: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయని పరీక్షల విభాగం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 లక్షల 26వేల 468 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 5,658 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.