: టీఆర్ఎస్ నుంచి తప్పుకోనున్న చెరుకు సుధాకర్
నల్గొండ జిల్లా నకిరేకల్ టీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కేసీఆర్ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న సుధాకర్ పార్టీని వీడాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతేగాక పార్టీలోకి కొండా దంపతుల చేరికను కూడా సుధాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమకారులను కేసీఆర్ అవమానించడం వల్లనే రాజీనామా చేస్తున్నట్లు వినికిడి.