: కార్డు లేకుండానే నిమిషాల్లో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా


మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉందా? అయితే ఎవరికైనా ఎక్కడికైనా నిమిషాల్లో డబ్బులు పంపించేసుకోవచ్చు. వారికి ఖాతా అవసరం లేదు. కార్డూ అవసరం లేదు. క్షణాల్లో వారి మొబైల్ కు పిన్ నంబర్ మెస్సేజ్ రూపంలో వెళుతుంది. సమీపంలోని ఏటీఎంకు వెళ్లి దాని సాయంతో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ సేవలను దేశంలోనే తొలిసారిగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న ప్రారంభించింది. ముందుగా కొన్ని ఎంపిక చేసిన ఏటీఎంలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 20 రోజుల్లో మిగతా ఏటీఎంలను కూడా ఇన్ స్టంట్ మనీ ట్రాన్స్ ఫర్ విధానం కిందకు తీసుకొస్తామని బ్యాంక్ సీఎండీ అయ్యర్ తెలిపారు. ఒక్క లావాదేవీలో 10వేల రూపాయల వరకూ పంపుకోవచ్చు. నెలలో రూ.25వేల వరకే పరిమితి ఉంటుంది. డబ్బు పంపేవారు ప్రతీ లావాదేవీకి 25 రూపాయల చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 4,000 ఏటీఎంలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News