: చెన్నై మ్యాచ్ లకు మేం ఆతిథ్యమిస్తాం: కేరళ సీఎం


శ్రీలంక తమిళుల వ్యవహారంలో తమిళనాట ఆగ్రహ జ్వాలలు చెలరేగుతుండడంతో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ క్లిష్టంగా మారింది. లంక ఆటగాళ్ళు, అంపైర్లు పాల్గొనే మ్యాచ్ లను చెన్నైలో జరగనివ్వబోమని ముఖ్యమంత్రి జయలలిత హెచ్చరించిన నేపథ్యంలో ఆ మ్యాచ్ లకు తాము ఆతిథ్యమిస్తామని కేరళ సీఎం ఊమెన్ చాందీ ముందుకొచ్చారు.

చెన్నై నుంచి ఆ మ్యాచ్ లను తరలించాలని భావిస్తే, కొచ్చిలో ఆ పోటీలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేరళ సీఎం చెప్పారు. ఈమేరకు కేరళ క్రికెట్ సంఘానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, ఐపీఎల్ తాజా సీజన్ ఏప్రిల్ 3న షురూ కానుంది.

  • Loading...

More Telugu News