: కేజ్రీవాల్ కోరికపై నేడు వారణాసి ప్రజల తీర్పు


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈ ఉదయం వారణాసి చేరుకున్నారు. ఇక్కడి నుంచి నరేంద్ర మోడీ లోక్ సభకు పోటీ చేయనున్న విషయం తెలిసిందే. వారణాసి ప్రజలు కోరితే తాను మోడీపై పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల మెజారిటీ సాధిస్తానని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ రోజు వారణాసిలో ర్యాలీ నిర్వహించనున్నారు.

వారణాసి చేరుకున్న కేజ్రీవాల్ ముందుగా గంగలో మునకేశారు. గంగమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానని అనంతరం విలేకరులతో చెప్పారు. భారతదేశాన్ని అవినీతి రహితం చేయాలన్నది తమ ఆశయమని అందుకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. మోడీతో ఢీకొనడం కంటే దేశాన్ని రక్షించడమే పెద్ద లక్ష్యంగా పేర్కొన్నారు. కేజ్రీవాల్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో డాక్టర్లతో సమావేశమయ్యాక రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం జరిగే బెనియా భాగ్ ర్యాలీలో తాను పోటీ చేయాలా? వద్దా? ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. వారు పోటీ చేయమంటేనే కేజ్రీవాల్ వారణాసిలో మోడీతో తలపడతారు.

  • Loading...

More Telugu News