: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ధావన్
గత ఐపీఎల్ సీజన్ లో బ్యాట్స్ మెన్ గా జట్టులో కీలకపాత్ర పోషించిన డాషింగ్ ఓపెనర్ ధావన్ కు ప్రమోషన్ దక్కింది. ఈ ఐపీఎల్-7 సీజన్ లో ధావన్ ను సన్ రైజర్స్ యాజమాన్యం కెప్టెన్ గా నియమించింది. అతనికి డిప్యూటీగా డారెన్ సామీ నియమితుడయ్యాడు. గతంలో ఛాంపియన్స్ లీగ్ లో ధావన్ కి కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది.