: ఏప్రిల్ 9న రాష్ట్ర బంద్ కు వామపక్షాల పిలుపు
ఏప్రిల్ 9న రాష్ట్ర వ్యాప్త బంద్ కు 10 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. దీనికి ముందుగా
ఏప్రిల్ 1న అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు
చేపట్టనున్నట్లు వామపక్ష పార్టీల ప్రతినిధి జి.విజయ్ కుమార్ తెలిపారు.
హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, నాలుగురోజుల పాటు వామపక్షాలు చేసిన నిరాహారదీక్షను ప్రభుత్వం భగ్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. విద్యుత్ ధరల
పెంపు ప్రతిపాదనను పునః సమీక్షిస్తున్న ఈఆర్ సీపై ముఖ్యమంత్రి ఒత్తిడి
తీసుకొస్తున్నారని ఆరోపించారు.