: తెలంగాణ కమిటీలు ప్రకటించిన చంద్రబాబు


ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ కమిటీలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం ప్రకటించారు. మొత్తం మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. 16 మందితో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎన్నికల కమిటీకి అధ్యక్షుడిగా ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లి దయాకర్ రావు, కన్వీనర్ గా మోత్కుపల్లి నర్సింహులు, సలహాదారుగా దేవేందర్ గౌడ్ వ్యవహరిస్తారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా రావుల చంద్రశేఖరరెడ్డిని నియమించారు. ఈ కమిటీలోనూ 16 మంది సభ్యులుంటారు. కాగా, త్వరలోనే ప్రచార కమిటీ వివరాలు వెల్లడిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.

  • Loading...

More Telugu News