: షారూక్ కుమారుడి 'ముద్దు'ముచ్చట్లు


తండ్రి షారూఖ్ ఖాన్ ఎన్నో సినిమాలు చేసిన పిదప స్టార్ హోదా దక్కించుకుంటే, ఆయన పుత్రుడు ఆర్యన్ ఖాన్ తన రొమాంటిక్ చర్యలతో స్టార్ పీఠం ఎక్కేశాడు. అతగాడు ఏం చేశాడో చూడండి. లండన్ లో విద్యాభ్యాసం చేస్తున్న ఆర్యన్ ఖాన్ ఇద్దరు భామలతో బుగ్గలపై ముద్దులు పెట్టించుకుంటూ కెమేరాకి చిక్కాడు. ఇద్దరు అందమైన భామలు ఆర్యన్ ను ముద్దుపెట్టుకుంటున్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీంతో, తండ్రి స్టార్ ఇమేజ్ ను తనయుడు ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నాడని బాలీవుడ్ గుసగుసలాడుతోంది. ఆర్యన్ గతంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలితో విహారయాత్రకు వెళ్లడం కూడా చర్చకు తెరతీసింది. అన్నట్టు... ఆర్యన్ వయసు 17 సంవత్సరాలే!

  • Loading...

More Telugu News