: పవన్ కల్యాణ్ రాజకీయ ఆరంగేట్రం మంచిదే: చిరంజీవి
పవన్ కల్యాణ్ కొత్తగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీపై ఆయన సోదరుడు, కేంద్ర మంత్రి చిరంజీవి తొలిసారి సానుకూలంగా స్పందించారు. రాజకీయాల్లోకి యువత రావడం అభినందించదగ్గ విషయమేనని చిరంజీవి చెప్పారు. ఈరోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమేనని పవన్ కల్యాణ్ కొత్తగా ఏర్పాటు చేసిన జనసేనను ఉద్దేశించి అన్నారు.
కాంగ్రెస్ నేతలు బస్సుయాత్ర తర్వాత తీర్థ యాత్రలు చేయాల్సిందేనని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య చేసిన వ్యాఖ్యలను చిరంజీవి తనదైన శైలిలో తిప్పికొట్టారు. అసలు ఈ తరహా యాత్రలను ఆరంభించింది బీజేపీయేనని ఆయన తెలిపారు. 1984లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రథయాత్ర చేసిన బీజేపీ రెండు సీట్లను దక్కించుకుందన్న విషయాన్ని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేశారు.