: ఎన్నికలు బహిష్కరించండి: మావోయిస్టులు
ఒడిశాలోని రాయగఢ జిల్లాలోని మునిగూడ, బిస్సాం, కటక్, కల్యాణ్ సింగ్ పూర్ లో మావోయిస్టుల ఏరివేతకు తలపెట్టిన ఆపరేషన్ ఉపసంహరించుకోవాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 10, 17 తేదీల్లో జరుగబోయే ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని గోడపత్రికల ద్వారా మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీనిపై, పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ, మావోయిస్టుల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను భారీ ఎత్తున రంగంలోకి దించనున్నామని స్పష్టం చేశారు.