: బీజేపీలో బ్రాహ్మణ వ్యతిరేక కుట్ర జరుగుతోంది: సమాజ్ వాదీ
బీజేపీలో బ్రాహ్మణులను అణగదొక్కే కుట్ర జరుగుతోందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. సీనియర్ నేతలను పక్కనబెట్టడమే అందుకు ప్రబల దృష్టాంతమని పేర్కొంది. నరేంద్రమోడీ, రాజ్ నాథ్ సింగ్ బ్రాహ్మణ వ్యతిరేకులని ఆరోపించింది. యూపీ వ్యవసాయ శాఖ మంత్రి మనోజ్ కుమార్ పాండే మీడియాతో మాట్లాడుతూ, బీజేపీలో సీనియర్లైన మురళీ మనోహర్ జోషి, కల్రాజ్ మిశ్రా, కేసరినాథ్ త్రిపాఠిలను పక్కనబెట్టడం బ్రాహ్మణ వ్యతిరేక వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. బ్రాహ్మణులేమీ మూర్ఖులు కాదని, జరుగుతున్న అవమానాలను గుర్తిస్తారని, ఎన్నికల్లో బీజేపీకి తప్పక బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.