: లేటు వయసులో ఘాటు ప్రేమ


పాకిస్థాన్ స్టార్ క్రికెటర్, తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా ఖాన్ లేటు వయసులో ఘాటు ప్రేమలో పడింది. బ్రిటన్ లో ఉద్యమకారిణిగా వినుతికెక్కిన జెమీమా... ఇమ్రాన్ ఖాన్ కోసం బ్రిటన్ వదిలి పాకిస్థాన్ వచ్చింది. ఇద్దరు పిల్లల్ని కన్న తరువాత ఇమ్రాన్ తో ఉండలేనని నిర్థారణకు వచ్చి బ్రిటన్ వెళ్లిపోయింది. ఇప్పుడు జెమీమా బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. బ్రిటన్ లో ఎక్కడ చూసినా వీరే కనిపిస్తున్నారని పేజ్ త్రీ కథనాలు. జెమీమా వేలికి రస్సెల్ బహుమతిగా ఇచ్చిన వజ్రపుటుంగరం కనిపిస్తోంది. రస్సెల్ బ్రాండ్ హాలీవుడ్ నటి కేట్ పెర్రీ మాజీ ప్రియుడు. ఈ మధ్యే వారికి కటీఫ్ అయింది. దానికి కారణం జెమీమా కాదుకదా...?.

  • Loading...

More Telugu News