: ఐపీఎల్ తర్వాత భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్ లో ఆడాలి: పీసీబీ చీఫ్
భారత్, పాకిస్తాన్ జట్లు ఐపీఎల్-7 ముగిసిన తర్వాత ఓ ద్వైపాక్షిక సిరీస్ లో పాల్గొనాలని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ నజామ్ సేథీ ఆకాంక్షిస్తున్నారు. స్వల్ప కాలిక సిరీస్ అయినా నిర్వహించాలని కోరారు. ఐపీఎల్ మ్యాచ్ లు యూఏఈలో జరిపేందుకు భారత్ నిర్ణయం తీసుకోవడం తమకు శుభపరిణామమని తెలిపారు. పాక్ కు యూఏఈ తటస్థ వేదికగా ఉన్న నేపథ్యంలో భారత్ తో ఇక్కడ మ్యాచ్ లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.