: అళగిరి మద్దతు కావాలి: బీజేపీ


సార్వత్రిక ఎన్నికల్లో అళగిరి మద్దతు కావాలని శివగంగ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హెచ్ రాజా అభ్యర్థించారు. ఈ మధ్యాహ్నం అళగిరితో ఆయన సమావేశమై తమిళనాట బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. దీనిపై అళగిరి సానుకూలంగా స్పందించారని రాజా చెబుతున్నారు. డీఎంకే బహిష్కరించడంతో అళగిరి కొత్త పార్టీ పెడతారని అందరూ ఆశించారు. ఆయన కొత్త పార్టీపై ఏమీ తేల్చకపోవడంతో బీజేపీ మద్దతు కోరుతోంది.

  • Loading...

More Telugu News