: బీజేపీలోకి బ్రహ్మానందం?
సినీ కమెడియన్ బ్రహ్మానందం బీజేపీలో చేరనున్నారా? అవుననే అంటున్నారు సినీ జనం. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు క్యూ కడుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మోడీతో భేటీ తరువాత మరో హీరో నాగార్జున నరేంద్ర మోడీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో బ్రహ్మానందం కూడా నరేంద్ర మోడీని కలవనున్నారని సమాచారం. మోడీని కలసిన తరువాత ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు మరో స్టార్ హీరో కూడా నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.