: పవన్ కల్యాణ్... ఇదేం పని?: శివాజీ
పవన్ కల్యాణ్ చేగువేరా ఆలోచన విధానం గురించి మాట్లాడారని, మరి బీజేపీ గూటికి చేరడమేమిటని సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. వామపక్ష తీవ్రవాది అయిన చేగువేరా అనుచరులు రైట్ వింగ్ బీజేపీకి మద్దతు పలకడం అర్థం కాలేదన్నారు. నోవాటెల్ లో పవన్ తన విమర్శకులకి ఘాటైన సమాధానం చెప్పారని ఆయన అన్నారు. అయితే, పవన్ జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోను స్పష్టం చేయలేదని శివాజీ చెప్పారు. గద్దర్ మిత్రుడైన పవన్ బీజేపీ వైపు వెళ్లడం కాస్త గందరగోళంగా ఉందని శివాజీ చెబుతున్నారు.