: అనుమతి లేని కటౌట్లు, హోర్డింగులను తొలగించాలి: హైకోర్టు


రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేని కటౌట్లు, హోర్డింగులను తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విచ్చలవిడిగా కటౌట్లను ఏర్పాటు చేయడంపై న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.

కటౌట్లు, హోర్డింగుల వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతోందని, వీటి వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశముందని, కాబట్టి తక్షణమే వీటిని తొలగించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కటౌట్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలను వారం రోజుల్లో తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News