: డుమినీ మెరుపులు... దక్షిణాఫ్రికా భారీ స్కోరు
న్యూజిలాండ్ తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో సఫారీ బ్యాట్స్ మన్ జేపీ డుమినీ (43 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సులు) విశ్వరూపం ప్రదర్శించాడు. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా... డుమినీ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్ ఆమ్లా 41 పరుగులు చేశాడు. డివిలీర్స్ 5 పరుగులు చేసి నిరాశపరిచాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, ఆండర్సన్ చెరో రెండు వికెట్లు తీశారు.