: పొన్నాల, నారాయణ... పొత్తులు, ఎత్తులు
టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు. పొత్తులు, ఎత్తులపై సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. తమ పార్టీకి 18 శాసనసభ స్థానాలు, 1 లోక్ సభ స్థానం కేటాయించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేస్తున్నారు. సీపీఐతో పొత్తుకు టీఆర్ఎస్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, వూహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ కాంగ్రెస్ సాన్నిహిత్యాన్ని కోరుకుంటోంది. ఈ మేరకు పొన్నాలతో నారాయణ భేటీ అయ్యారు.