: నాగార్జునతో మోడీ భేటీ
తెలుగు సినీ నటుడు నాగార్జున, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న నాగార్జున గుజరాత్ లో నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. నరేంద్ర మోడీ, గుజరాత్ పై రూపొందించిన డాక్యుమెంటరీని కూడా వీక్షించారు. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీకి తన మద్దతు తెలిపేందుకు నాగార్జున ఆయనతో భేటీ అయినట్టు సమాచారం.