: కేసీఆర్ తో వరవరరావు భేటీ


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వరవరరావు కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేత, రాజకీయ ఖైదీల విడుదల తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

భేటీ అనంతరం వరవరరావు మీడియాతో మాట్లాడారు. మావోయిస్టు పార్టీ ఎజెండానే అమలు చేస్తానని గతంలో కేసీఆర్ మాట ఇచ్చారని, ఇప్పుడు ఆ విషయం గుర్తు చేసినట్లు ఆయన చెప్పారు. ఏడేళ్లుగా కారాగారంలో మగ్గుతున్న వారిని విడుదల చేయాలని కోరామని ఆయన అన్నారు. ఎన్ కౌంటర్లు, నిషేధాలు లేని విధంగా తెలంగాణలో పాలన సాగించాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News