: వేసవిలో బీరు హానికరమా?


మందుబాబులకు దుర్వార్త! సెగలు పుట్టించే వేసవిలో చల్లటి బీరుతో సేద దీరుదామనుకునే బీరు ప్రియులకు ఇది మరింత చేదు వార్తే. ఎండాకాలంలో బీరు తాగితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని ఓ అధ్యయనం చెబుతోంది. బీరు డైయూరిటిక్ గా పనిచేసి శరీరం నుంచి నీటిని తొలగిస్తుందని గోవాలోని ప్రముఖ నెఫ్రాలజిస్టు షీతల్ లెంగాడే తెలిపారు. తద్వారా ఆక్సలేట్ పదార్థం పేరుకుపోయి రాళ్ళు తయారవుతాయని వివరించారు. డీహైడ్రేషన్ ఎక్కువగా కలిగే వేసవి కాలంలో తమవద్దకు కిడ్నీలో రాళ్ళతో పేషెంట్లు వస్తుంటారని లెంగాడే చెప్పారు. బీరు తాగే వారిలో ఈ సమస్య మరీ ఎక్కువని వివరించారు.

  • Loading...

More Telugu News