: పవన్ కల్యాణ్ కి రాళ్ల దెబ్బలు తప్పవు: సారయ్య
పవన్ కల్యాణ్ తెలంగాణలో అడుగుపెడితే మానుకోట ఘటన పునరావృతమవుతుందని మాజీ మంత్రి బసవరాజు సారయ్య హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ సీమాంధ్ర కోసం పార్టీ స్థాపించాడని అన్నారు. ఆయన మేనిఫెస్టో చూస్తే ఆ విషయం తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను కూడా ఉద్ధరిస్తానని ఇక్కడ పవన్ కల్యాణ్ అడుగుపెడితే మానుకోటలో వైఎస్సార్సీపీ అధినేతకు ఎలాంటి సన్మానం జరిగిందో అలాంటిదే మరోసారి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.