: హత్యాయత్నం కేసులో సినిమా విలన్ అరెస్టు
సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన నటుడు నిజజీవితంలో కూడా విలన్ అవతారమెత్తాడు. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో రెహ్మాన్ అనే సినీ నటుడ్ని పశ్చిమ మండల పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో రెహ్మాన్ పాత్ర ఉందనే విషయం నిర్ధారణ అయిందని, దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. విక్రమార్కుడు సినిమా చూసిన ప్రేక్షకులకు రెహ్మాన్ సుపరిచితుడు.