: స్థానిక ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 6, 8 తేదీల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నిక జరుగుతుంది. ఫలితాలు వచ్చే నెల 11వ తేదీన వెలువడతాయి.