: అమితాబ్ రాజకీయ నిర్వేదం
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ రాజకీయాల పట్ల నిరాసక్తత కనబరుస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలేవీ లేవని స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం పాలైన బిగ్ బి క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన తాజా చిత్రం 'భూత్ నాథ్ రిటర్న్స్' రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ నేపథ్యంలో పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారా? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. 71 ఏళ్ళ అమితాబ్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున అలహాబాద్ లోక్ స్థానం నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత బోఫోర్స్ కుంభకోణంలో ఆయన పేరు వినిపించిన దరిమిలా క్రమేపీ రాజకీయాలకు దూరమయ్యారు.