: కవితే కాదు మరెవరైనా సరే... విజయం నాదే: మధుయాష్కీ
నిజామాబాదులో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి కేసీఆర్ కూతురు కవిత పోటీ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. కవితే కాదు, మరెవరు పోటీ చేసినా విజయం తనదే అని చెప్పారు. నిజామాబాద్ స్థానంలో టీఆర్ఎస్ మూడవ స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ద్రోహులతో చేయి కలుపుతున్న టీఆర్ఎస్ కు ఇక్కడి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.