: ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు కక్ష సాధింపు కాదు : డీప్యూటీ సీఎం


రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలపై టాస్క్ ఫోర్సు కమిటీ తనిఖీలు చేయడం కక్ష సాధింపు చర్య కాదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. వాటిలో మంచి కళాశాలలు కూడా ఉన్నాయన్నారు. ప్రస్తుతం కళాశాలల్లో తనిఖీలు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. అయితే తనిఖీల్లో బయటపడిన లోపాలు సరిదిద్దుకునేందుకు యాజమాన్యాలు తప్పకుండా చర్యలు చేపట్టాలని రాజనర్సింహ, మంత్రి కొండ్రు మురళి సూచించారు. తనిఖీలపై టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పిస్తుందని తెలిపారు.  కాగా, వైద్యవిద్యలో ఫీజులు పెంచుతారన్నది అవాస్తవమన్నారు.

  • Loading...

More Telugu News